ఆదిలాబాద్ సుందరయ్య భవన్లో చేపట్టిన ఆర్టీసీ మహిళా కార్మికుల సమ్మెకు భాజపా ఎంపీ సోయం బాపురావు, నేత, మాజీ ఎంపీ వివేక్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నక్సలైట్ల నుంచి డబ్బులు తీసుకున్నారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ఈరోజు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కొన్ని సంఘాలను నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజలకు మేలు చేయక పోగా.. కమిషన్ కోసం ఆంధ్రా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ దుయ్యబట్టారు.
ఇదీ చూడండి : "డెంగీని నివారించండి... లేకపోతే మృతులకు రూ.50 లక్షలు ఇవ్వండి"