ఆదిలాబాద్ జిల్లాలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం వేకువజామునే ఉట్నూర్ మండలం లక్కారంలో వందలాది మంది మహిళలు కలశాలు, మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి... కార్తిక దీపాలు వెలిగించారు.
మంచిర్యాల జిల్లాలోని కలమడుగు సమీపాన ఉన్న గోదావరికి భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబసమేతంగా తరలి వచ్చి... నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేసి... అనంతరం కార్తిక దీపాలు వెలిగించారు.
ఇదీ చదవండి: తెలంగాణకు కార్తిక వైభవం.. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆలయాలు