ఆదిలాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. వారం రోజుల తర్వాత కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. రైతులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఆగకుండా కురిసిన వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయమై.. నిర్మానుష్యంగా మారాయి. పట్టణంతో పాటు.. బేల, జైనథ్, తాంసీ, భీంపూర్, గుడిహత్నూర్ మండలాల్లో కూడా వర్షం కురిసింది.
ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ