ETV Bharat / state

'ఆదివాసీలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి' - latest news of adilabad

సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో చందన సూచించారు. పేదలకు ఆమె నిత్యావసరాలు పంపిణీ చేశారు.

groceries distribution by mpp at utnuru in adilabad
'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి'
author img

By

Published : Jul 9, 2020, 8:45 PM IST

ఆదివాసీలకు ఐటీడీఏ పీవో చందన చేయూతనిచ్చారు. రెండో విడత సాయం కింద 12వందల మందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం చెరువు గూడ, కామాయి పేట, బొప్పాపూర్ వాసుల అవస్థలు చూసి ఆమె స్పందించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు.

ఆదివాసీ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని.. ఏమైనా సమస్యలుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీపీ జయంత్​రావు సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: కొవిడ్​ తీవ్రతతో ఛలో శ్రీహరి కోట వాయిదా: నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.