ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్, ఎంపీవోలను వెంటనే అరెస్టు చేసి, రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైద్యులు నిరసనకు దిగారు. లేనిపక్షంలో సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా విధులు బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు వైద్యుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జీ ఎస్పీని కలిసి విన్నవించారు.
విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న వైద్యులను భయబ్రాంతులకు గురిచేసిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుని తమకు భరోసా కల్పించాలని కోరారు.