చిరుజల్లులు... ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ రైతుల గుండెలు ఝల్లుమనేలా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మే సమయానికి అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చేలా చేస్తోంది.
ఉట్నూర్ కొనుగోలు కేంద్రంలో.. విక్రయించిన ధాన్యం తీసుకెళ్లేందుకు లారీలు లేక మూడ్రోజుల నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. చేసేదేం లేక రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో కుప్పలుగా పోశారు.
ఈరోజు కురిసిన చిరుజల్లుల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. గ్రామ సమైక్య సంఘం వారు ధాన్యం కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన