ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లనే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెరాస అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. జాతీయ నేర గణాంకాల విభాగం విడుదల చేసిన నివేదిక గురించి ఆదిలాబాద్‌లో ఆయన వెల్లడించారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల కోసం పాటుపడుతోందని వెల్లడించారు. తెరాస పాలన విజయానికి నేరగణాంకాల నివేదికే నిదర్శనమని ఆయన వివరించారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన