కరోనా నివారణ కోసం కేంద్రం రాష్ట్రానికి రూ.7వేల కోట్లు ఇచ్చిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. మంగళవారం తన పుట్టినరోజు వేడుకలను ఆయన నిరాడంబరంగా జరుపుకొన్నారు. జర్నలిస్టులకు నిత్యావసరాలను అందజేశారు. వివిధ పథకాల కింద రైతులకు, బడుగులకు నిధులు కేటాయిస్తోందని ఎంపీ పేర్కొన్నారు.
తెరాస నేతలు మాత్రం కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా కేంద్రంపై దుష్ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నపుడు జారీ చేసిన జీవో నెం.3ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని... దీనిపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు