ETV Bharat / state

ఇంటి వద్ద పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

author img

By

Published : Apr 2, 2021, 5:41 PM IST

సాధారణంగా పరీక్షలు అనగానే ప్రత్యేక కేంద్రంలో బెంచీకి ఒకరిద్దరు కూర్చొని ఇన్విజిలేటరు పర్యవేక్షణలో రాయడమనేది ఎప్పూడూ చూస్తున్నదే. ఇందుకు భిన్నంగా కొవిడ్‌ పుణ్యమాని ఇపుడు ఇంటి వద్దనే ఎవరికి వారు పరీక్ష రాసే రోజులు చూడాల్సి వస్తోంది. అదెలాగనేగా.. మీ సందేహం.. ఇదీ చూడండి మరి..

exams
పరీక్షలు

ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఈనెల 1, 3తేదీల్లో నైతికత-మానవీయ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు జరిగాల్సి ఉండగా.. కొవిడ్‌ విజృంభనతో వారం కిందటే ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తూ సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయకుండా ఇంటి వద్దే రాసుకునే వెసులుబాటు కల్పించింది. ఇదివరకు సాగిన ఆన్‌లైన్‌ బోధనతో విద్యార్థులతో కూడిన వాట్సప్‌ గ్రూపులను తయారు చేయడంతో ఇంటర్‌బోర్డు నుంచి వచ్చిన ప్రశ్నపత్రాన్ని ఆ గ్రూపునకు పంపించి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు.

వాట్సాప్‌ గ్రూపులో వచ్చిన ప్రశ్నపత్రం చూసి విద్యార్థులు ఏ4సైజు పేపరుపై సమాధానాలు రాసి ఈనెల 20వ తేదీలోగా కళాశాలలకు నేరుగా వెళ్లిగానీ, పోస్టు ద్వారాగానీ సమర్పించేలా అవకాశం కల్పించింది. కరోనా దృష్ట్యా పరీక్షలు జరగవన్న ఆందోళన దూరమైంది. పరీక్ష ఇంటి వద్దనే రాయడంతో కరోనా దరిచేరే అవకాశం లేకుండా పోయిందని, ఇదో సరికొత్త అనుభూతినిస్తోందని విద్యార్థులంటున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో 9,930 మంది విద్యార్థులు ఇంటి వద్దనే రాస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఆయాపరీక్షలను ఎలా రాస్తున్నారో తెలుసుకునేందుకు ఆదిలాబాద్‌ జిల్లా మాద్యమిక విద్య అధికారి రవీందర్‌ కుమార్‌, బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ భగవాన్ ఆదిలాబాద్‌ పట్టణంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పర్యవేక్షించారు. విద్యార్థులు అవగాహనతోనే పరీక్షలు రాస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మంత్రి అజయ్​కుమార్​ ఎంత దుర్మార్గుడంటే... ప్రశాంత్​రెడ్డి సెటైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.