ETV Bharat / state

స్థానిక సంస్థల విద్యుత్‌ బకాయిలు రూ.64.04కోట్లు - Current Bills news in Adilabad latest news

విద్యుత్‌ శాఖకు ప్రభుత్వ కార్యాలయాల కరెంటు బిల్లులు గుదిబండగా మారాయి. కోట్లకు కోట్ల బిల్లులు వసూలు కావడం లేదు. స్థానిక సంస్థలకు సంబంధించిన విద్యుత్‌ ఛార్జీలు అయితే నెలనెలా పేరుకుపోతూనే ఉన్నాయి. నెలల తరబడిగా బిల్లులు చెల్లించకపోవడం వల్ల రూ.64.04 కోట్లకు చేరుకుంది. గృహవసరాలకు సబంధించిన ఛార్జీలనైతే భయపెట్టి వసూలు చేసే వీలున్నప్పటికీ... ప్రభుత్వ సంస్థలను ఏమనలేని పరిస్థితి కనిపిస్తోంది.

electricity-arrears-of-government-agencies-in-adilabad-district
స్థానిక సంస్థల విద్యుత్‌ బకాయిలు రూ.64.04కోట్లు
author img

By

Published : Oct 6, 2020, 1:49 PM IST

జిల్లాల పునర్విభజన తరువాత విద్యుత్‌ శాఖను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ... ఛార్జీల వసూళ్లు ప్రతిబంధకంగా మారుతోంది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు నెలనెల బిల్లులు చెల్లించక ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.64.04 కోట్లకు బకాయిలు చేరుకున్నాయి. ఇందులో ఒక్క ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ రూ.6.43కోట్లు విద్యుత్‌శాఖకు చెల్లించాల్సి ఉంటే... ఉట్నూర్‌ ఐటీడీఏ రూ.10.99 కోట్లు చెల్లించాల్సి ఉంది. విద్యాశాఖ 13.60 కోట్లు, రెవెన్యూ, పోలీసుశాఖల తరపున రూ. 3.5కోట్ల చొప్పున విద్యుత్‌శాఖకు పెండింగ్‌ బిల్లు చెల్లించాల్సి ఉంది.

ప్రభుత్వ సంస్థల్లో పేరుకుపోతున్న బకాయిలపై విద్యుత్‌శాఖ దృష్టిసారిస్తున్నప్పటికీ... ఏమీచేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం విడుదల చేసే నిధుల నుంచి ప్రభుత్వ సంస్థలు ఎప్పటికప్పుడు విద్యుత్‌ ఛార్జీలు చెల్లిస్తే బకాయిలు పేరుకుపోవడానికి అవకాశమే ఉండదు. ప్రభుత్వశాఖలకు క్రమంతప్పకుండా బిల్లులు పంపిస్తూనే ఉన్నామనే మాట విద్యుత్ శాఖ అధికారుల నుంచి వినిపిస్తోంది.

ఇవీచూడండి: ఆ దెబ్బకి ఇబ్బందుల్లో పడ్డ సూక్ష్మ పరిశ్రమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.