దివంగత నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 103వ జయంతిని ఆదిలాబాద్‌లో జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చూపిన మార్గమే భాజపా అనుసరిస్తున్న విధానాలని భాజపా జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
ఇవీ చూడండి: పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం: కేటీఆర్