అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లో ఘనంగా దండారి సంబురాలు జరుగుతున్నాయి. ఉట్నూర్ మండలంలోని ఘన్పూర్, మత్తడిగూడా గ్రామాల్లో ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా దండారి వాయిద్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడాలో ఆదివాసీలు ముందుగావెళ్లి దండారికి పూజలు నిర్వహించారు.
గుస్సాడి వేషధారులు వాడే వాయిద్యాలు, సామాగ్రికి గ్రామ పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. నేటి నుంచి దీపావళి పండుగ వరకు గుస్సాడి వేషధారణతో పాటు ఆ గూడాలకు సంబంధించిన ఆదివాసీలు పలు గుడాలకు వెళ్లి.. అక్కడి వారు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అదే విధంగా వేరే గ్రామానికి చెందిన వారిని తమ గ్రామాలకు ఆహ్వానించి ఆతిథ్యమిచ్చిపుచ్చుకుంటారు. ఈ సంబరాలతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటామని గ్రామ పటేల్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆదిలాబాద్‌లో కుంకుమార్చన.. భారీగా తరలొచ్చిన భక్తులు