ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గోండ్ కోలాం గూడ పంచాయతీలోని కొత్తగూడెంలో దండారి సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీలు వారి సాంప్రదాయ ప్రకారం 20 ఏళ్ల తర్వాత చిన్నా... పెద్ద తారతమ్యం లేకుండా యువతతో పాటు అందరూ కనుబొమ్మలు, తల వెంట్రుకలు సమర్పించుకున్నారు.
ఉట్నూరు ఆదిలాబాద్ కడెం ఖానాపూర్ సిర్పూర్ మండలాల నుంచి వందలాది మంది ఆదివాసీలు తరలివచ్చి.. ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయంతో కనుబొమ్మలు. తల వెంట్రుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇలా 20 ఏళ్లకు ఒకసారి తల వెంట్రుకలు కనుబొమ్మలు సమర్పించుకుంటే... పంట క్షేత్రాలలో పండిన ధాన్యాన్ని ఎత్తుటకు వీలుంటుందని ఆదివాసి పెద్దలు పేర్కొన్నారు.