లాక్‌డౌన్ సడలింపులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సందడి కనిపిస్తోంది. సరి, బేసి సంఖ్యలతో అధికారులు దుకాణాలకు అనుమతిచ్చారు. జరిమానాల భయంతో యజమానులు... తమ దుకాణాల ముందు రంగులతో గుండ్రటి సర్కిళ్లు గీసి... నో మాస్క్.. నో ఎంట్రి అంటూ జాగ్రత్తలు రాసి బోర్డుసు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జిల్లాలో ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ రావడం వల్ల నిబంధనలను కఠినతరం చేశారు. నిర్మల్ జిల్లాలో సరి, బేసి సంఖ్యలతో దుకాణాలకు అనుమతిచ్చినా.. జనసందడి ఎక్కువగా ఉంది.