ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట.. సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాల వైఖరిని సీపీఐ నాయకులు దుయ్యబట్టారు. ఆయా డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కలవేణి శంకర్ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఆ హామిని నెరవేర్చలేదని ఆరోపించారు. అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి : జలదిగ్బంధంలోనే హైదరాబాద్ శివార్లలోని కాలనీలు