ETV Bharat / state

సీసీఐ రంగంలోకి దిగిన సరే.. పత్తి రైతుకు దక్కని మద్దతు ధర..

Cotton Farmers Concern of is cotton price has decreased: ఆదిలాబాద్​ వ్యవసాయ మార్కెట్​లో పత్తి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ రంగంలోకి దిగిన సరే అధిక ధర పలకడం లేదని వాపోయారు. సీసీఐ అధికారులు, ప్రైవేట్​ వ్యక్తులు కుమ్మక్కై ధరను తగ్గించేస్తున్నారని మండిపడ్డారు.

Cotton Farmers
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్
author img

By

Published : Dec 21, 2022, 7:00 PM IST

Cotton Farmers Concern of is cotton price has decreased: భారత పత్తి సంస్థగా పేరొందిన సీసీఐ వాణిజ్య కొనుగోళ్లకు ముందుకొచ్చినా రైతులకు మేలు జరగడంలేదు. సీసీఐ రంగంలోకి దిగితే ధర పెరుగుతుందని ఆశించిన రైతులకు రెండు రోజులుగా నిరాశనే ఎదురవుతోంది. వ్యాపారులతో కలిసి వేలంపాటలో పాల్గొన్న అధికారులు తొలిరోజు క్వింటాలుకు 8వేల పది రూపాయలు ధర నిర్ణయించగా.. రెండో రోజూ అదే ధరను నిర్ణయించారు. సీసీఐ నిబంధనలకు తోడు ధర తక్కువగా నిర్ణయించడంతో రైతులంతా వ్యాపారులకే పత్తిని విక్రయిస్తున్నారు.

గత 15 రోజుల వ్యవధిలో క్వింటాలుకు వెయ్యి రూపాయలు తగ్గించిన వ్యాపారులు.. సీసీఐ రాకతో ధరను పెంచుతారని రైతులంతా భావించారు. కానీ అదీ జరగలేదు. సీసీఐ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ధర విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం వారం రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నా.. మిగిలిన మార్కెట్లతో పోల్చితే ఆదిలాబాద్‌లో ధర ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

"ఈ రోజు సీసీఐ రంగంలోకి వచ్చిందని పత్తి అమ్మడానికి వచ్చాను. నిన్న ఉన్న పత్తి ధర రూ.8100 ఉంటే నేడు రూ.90 తగ్గి రూ.8010కు చేరుకుంది. సీసీఐ వచ్చింది మేలు చేస్తోంది అనుకుంటే అదీలేదు. నాడు ఆకాల వర్షాలతో రైతు నీట మునిగితే.. నేడు పత్తి గిట్టుబాటు ధర రాక ఇలా మునిగిపోయాడు. సీసీఐ మీద నమ్మకంతో వచ్చిన తమకి ప్రైవేట్​ వారిని నమ్మాలో తెలియడం లేదు.. సీసీఐను నమ్మాలో తెలియడం లేదు." - స్వామి, పిప్పల్‌కోటి, రైతు

"నిన్న ఉన్న పత్తి ధర సీసీఐ వచ్చిన తరవాత ఇంకా దిగువకు దిగింది. ఒక్కోక్కరి ఇళ్లల్లో పత్తి పోగులుగా ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో ధర పలుకుతుంది అనుకుంటే ఈ రోజు ఇలా జరిగింది. సీసీఐ, ప్రైవేట్​ వ్యక్తులు కుమ్మక్కై ధరను అమాంతం తగ్గించారు. ఇప్పుడు పత్తిని సాగు చేయడానికి అయిన ఖర్చు సైతం తమకు రాలేదు." - దేవారెడ్డి, వడూర్‌, రైతు

"ఆదిలాబాద్​ మార్కెట్​లో సీసీఐ కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఓపెన్​ ఆక్షన్​లో పత్తి రేటు రూ.8010గా నిర్ణయించడం జరిగింది. ఈ రోజు వరకు 1.50లక్షల క్వింటాల్​ పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. గతంతో పోలిస్తే 2.50లక్షల క్వింటాల్​ తక్కువగా వచ్చింది. దీనిగల కారణాన్ని రైతులను అడిగితే రేటు పెరిగితేనే పత్తిని అమ్ముతాము.. లేకపోతే నిల్వ చేసి ఉంచుతామన్నారు. ఇతర మార్కెట్లలో పోలిస్తే ఇక్కడనే రేటు అధికంగా ఉంది." - వెంకన్న, మార్కెట్‌కమిటీ కార్యదర్శి, ఆదిలాబాద్‌

ఆదిలాబాద్​లో పత్తిరైతుల ఆవేదన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.