ETV Bharat / state

రిమ్స్​లో 8 మంది జూనియర్​ వైద్యులకు కొవిడ్​ - corona virus

ఆదిలాబాద్​ జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న వైద్యులు కూడా కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రిమ్స్​లో 8 మంది జూనియర్​ వైద్యులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణైంది. మరో 50 మంది నమూనాలను పరీక్షల కోసం సేకరించారు. దీంతో జూనియర్​ వైద్యులు విధులపై విముఖత చూపుతున్నారు.

corona postive to 8 junior doctors in rims at adilabad
రిమ్స్​లో 8 మంది జూనియర్​ వైద్యులకు కొపిడ్​
author img

By

Published : Jul 29, 2020, 7:43 AM IST

ఆదిలాబాద్​ జిల్లాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. కంటికి కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు కొవిడ్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలువురు స్టాఫ్‌నర్సులు వైరస్‌బారిన పడగా తాజాగా రిమ్స్‌లో హౌజ్‌ సర్జన్ల (జూనియర్‌ వైద్యుల)కు మహమ్మారి సోకింది. ఎనిమిది మంది జూనియర్‌ వైద్యులకు కరోనా నిర్ధారణ కాగా వారి ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్న మరో 50 మంది వరకు జూనియర్‌ వైద్యులను అనుమానితులుగా భావించి మంగళవారం నమూనాలను సేకరించారు. వారి ఫలితాలు బుధవారం వెలువడే అవకాశం ఉంది. నివేదికలు వచ్చే వరకు వీరంతా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

సేవల్లో అంతరాయం

రోగులకు సేవలు అందించడంలో ప్రధాన పాత్ర జూనియర్‌ వైద్యులదే. సీనియర్‌ వైద్యులు ఆసుపత్రిలోని రోగులను పరీక్షించి వారికి అందించాల్సిన చికిత్స గురించి సూచనలు చేస్తారు. ఈ సూచనల మేరకు జూనియర్‌ వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తుంటారు. మధ్యాహ్నం అనంతరం సీనియర్‌ వైద్యులు ఎవరూ దాదాపు అందుబాటులో ఉండరు. ఈ సమయంలో బాధితుల పరిస్థితి విషమంగా మారితే పరిస్థితిని బట్టి జూడాలే వైద్యం అందిస్తుంటారు. అత్యవసర సమయంలో చరవాణిలో సీనియర్‌ వైద్యులను సంప్రదించి అప్పటికప్పుడు బాధితులకు వైద్యం అందిస్తుంటారు. కాగా ఆసుపత్రిలోని మొత్తం 100 మంది జూనియర్‌ వైద్యుల్లో ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడం, మరో 50 మంది నమూనాలు ఇచ్చి క్వారంటైన్‌కు వెళ్లడం.. మరికొందరు విధులు నిర్వహించడానికి విముఖత చూపుతుండటంతో వైద్యసేవల్లో అంతరాయం ఏర్పడింది. పలు వార్డుల్లో బాధితులకు కేవలం స్టాఫ్‌ నర్సులే దిక్కయ్యారు.

కొవిడ్‌ వార్డులోనూ...

కొవిడ్‌ వార్డులోనూ మంగళవారం బాధితులకు ఇబ్బందులు తప్పలేదు. ఈ వార్డులో డ్యూటీ వైద్యాధికారితో పాటు నలుగురు జూనియర్‌ వైద్యులు ఉండాలి. అనుమానిత జూనియర్‌ వైద్యులు కరోనా నిర్ధారణ కోసం నమూనాలు ఇవ్వడానికి వెళ్లారు. దీంతో ఈ వార్డులో వైద్యులు వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి ఏ ఒక్క వైద్యుడు వార్డులోకి రాలేదని ఒక బాధితుడు వాపోయారు. స్టాఫ్‌ నర్సులు మాత్రమే వచ్చి మాత్రలు ఇచ్చి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయని సిబ్బందికి సూచించినా ఎవరూ రాలేదన్నారు.

భీంపూర్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఆదిలాబాద్​ జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ.. మండల కేంద్రమైన భీంపూర్‌ గ్రామస్థులు స్వీయ నియంత్రణకు నడుం బిగించారు. తమ గ్రామస్థులు ఇతర గ్రామాలకు వెళ్లకుండా, ఇతరులు తమ గ్రామంలోకి అడుగు పెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సర్పంచి మడావి లింబాజీ, ఉప సర్పంచి రవీందర్‌ రాఠోడ్‌, ఎంపీటీసీ సభ్యులు రవీందర్‌, సంతోష్‌ గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. అంతర్గత రహదారులను బారీకేడ్లతో మూసివేశారు. పొలం పనులు, ఇతర అత్యవసరాలకు గ్రామస్థులకు బయటకు వెళ్లేలా ఒకదారిని తెరిచి ఉంచారు. మిగిలిన దారులన్నీ మూసి వేశారు. మండలకేంద్రం కావడంతో ఆదిలాబాద్‌ పట్టణ చిరు వ్యాపారులు తమ వస్తువులు, సరకులు విక్రయించుకునేందుకు గ్రామంలో రోడ్ల వెంబడి ఇంటింటికి తిరిగుతూ ఉంటారు. ఈక్రమంలో బయట వ్యక్తులు ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేసినట్లు సర్పంచి లింబాజీ తెలిపారు.

ఇవీ చూడండి: 'కరోనా బాధితుల్లో 47.1 శాతం మంది వారే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.