ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రి నుంచి కరోనా బాధితులు పరారైనట్టు భాజపా జిల్లా అధ్యక్షులు పాయల్ అనుమానం వ్యక్తం చేశారు. సరైన వసతులు, వైద్యం అందక బాధితులు భయాందోళనలకు గురవుతున్నారని, సరిపడా నిధులు వెచ్చించి ఆరోగ్య వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు కరోనా నివారణ చర్యల నిమిత్తం కోటి రూపాయలు తన నిధుల నుంచి కేటాయించారని గుర్తు చేశారు. అయినా సౌకర్యాలు కల్పించలేదని, పలువురు బాధితులు ఫోన్ ద్వారా చెప్పుకొని బాధపడ్డారని తెలిపారు. కరోనా విస్తరించి ప్రజల ప్రాణాలు పోతుంటే.. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం శోచనీయం అన్నారు. ఈ విషయమై ఆస్పత్రి డైరెక్టర్ని ప్రశ్నిస్తే.. బక్రీద్ సెలవు కాబట్టి రాలేదని చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్