ETV Bharat / state

కలెక్టరేట్​లో కరోనా కలకలం.. 20 కేసులు నిర్ధారణ.. - ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో కరోనా కేసులు తాజా వార్త

ఆదిలాబాద్​ జిల్లా కలెక్టరేట్​, క్యాంపు కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా కలెక్టర్​ కార్యాలయంలోని 8 మంది ఉద్యోగులకు పాజిటివ్​ నిర్ధారణ కాగా.. ఇప్పటివరకు మొత్తం 20మందికి వైరస్​ సోకిందని అధికారులు వెల్లడించారు.

corona cases in adilabad collectorate
ఆ కలెక్టర్​ కార్యాలయంలో కరోనా కలకలం.. 20 కేసులు నిర్ధారణ
author img

By

Published : Jul 29, 2020, 8:06 PM IST

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్​ను కరోనా మహమ్మారి కలవరపెడుతొంది. గత కొన్ని రోజులుగా కలెక్టర్​ కార్యాలయం​తో పాటు క్యాంపు కార్యాలయంలో వైరస్​ కేసుల సంఖ్య పెరగడం వల్ల ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కలెక్టరేట్​లో ఎనిమిది మందికి పాజిటివ్ నిర్ధారణ కావడం ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

అదనపు కలెక్టర్ సీసీ మహమ్మారి బారినపడగా.. ముగ్గురు అటెండర్లకు సైతం కొవిడ్​ సోకింది. అటు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు అటెండర్లకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీనితో కలెక్టరేట్, క్యాంప్ కార్యాలయంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 20కి చేరుకుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఉద్యోగులు భయం భయంగా విధులకు హాజరవుతున్నారు. కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.