ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి పట్ల భయం అక్కర్లేదన్నారు జిల్లా లీగల్ అథారిటీ కార్యదర్శి కంచె ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని సహజమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు ఆ వైరస్ తట్టుకోలేదని ఆయన పేర్కొన్నారు.
కరోనా వ్యాధి లక్షణాల నివారణపై ఆదిలాబాద్ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యాధి బారిన పడితే ప్రాణాలు పోతాయనే అపోహాలను నమ్మెుద్దని జిల్లా అదనపు వైద్యాధికారి సాధన కోరారు. స్వైన్‌ఫ్లూ లాంటి లక్షణాలే కలిగిన కరోనాను కేవలం వ్యక్తిగత పరిశుభ్రతతో నివారించవచ్చని ఆమె సూచించారు.