భారత రాజ్యాంగం గొప్పదని, దాన్ని అనుసరించడం దేశపౌరుల ప్రథమ కర్తవ్యమని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజ్యాంగాన్ని అనుసరించి విధులు నిర్వహిస్తామని వివిధ కోర్టుల న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులతో ప్రధాన న్యాయమూర్తి ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చదవండి: సింగరేణిలో సమ్మె... సంస్థకు కోట్లలో నష్టం