ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని రైతువేదిక వద్ద తెరాస, కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. ఉచితంగా కందుల పంపిణీలో కజ్జర్ల సర్పంచి భర్త కిరణ్.. రెచ్చగొట్టేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో వివాదం రేగింది.
అది గమనించిన కాంగ్రెస్‌కి చెందిన జడ్పీటీసీ గణేశ్‌రెడ్డి వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటుచేసుకుంది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సహా ఇతరులు ఇరువర్గాలను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి: Petrol Protest: పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్