ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన పల్లెబాట పట్టారు. ఇందులో భాగంగా గురువారం రోజున జైనథ్ మండలం కాప్రిలో పల్లెనిద్ర చేశారు. వేకువ జామునే గ్రామంలోని ఇంటింటికి తిరిగుతూ... మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల ఆవశ్యకతను స్థానికులకు వివరించారు.
గ్రామస్తులందరితో కలెక్టర్ శ్రీదేవసేన ప్రతిజ్ఞ చేయించారు. మరుగుదొడ్డినే వాడాలని, బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించాలని కోరారు. మరుగుదొడ్డి లేకపోతే మహిళలు పడే అవస్థలను వివరిస్తూ... అందరినీ ఆలోచింపజేశారు. ఏ ఒక్కరూ బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని కలెక్టర్ సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలన్నారు.