వచ్చే రెండేళ్లలో ఆదిలాబాద్ పట్టణ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం.. పచ్చని నందనవనం ఆవిర్భవిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఈరోజు పట్టణ శివారులోని దుర్గానగర్ హరితవనం సందర్శించారు. అక్కడ స్థానిక పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌తో కలసి మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట అదనపు పాలనాధికారి డేవిడ్, పుర కమిషనరు మారుతిప్రసాద్ తదితరులు ఉన్నారు. అందరి సహకారంతో జిల్లాను అందంగా తీర్చుదిద్దుతామని కలెక్టర్ తెలిపారు.
ఇవీచూడండి: సర్కారీ బడుల్లో 'ఆన్లైన్ విద్య' ఎలా?