చూస్తే ఆర్డినరీ... ఎక్కితే ఎక్స్ప్రెస్ పేదలకు ప్రయాణ ఖర్చులు తగ్గించేందుకు ఏర్పాటు చేసిన పల్లె వెలుగు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. చూస్తే ఆర్డినరీ బస్సు.... ఎక్కి సగం దూరం వెళ్లాక ఎక్స్ప్రెస్ బస్సని చెప్పి టిక్కెట్లు తీసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మాకేం తెలీదు డిపో మేనేజర్లని అడగండంటూ కండక్టర్లు చెబుతున్నారు. ఇదీ నిర్మల్ జిల్లా భైంసా డిపోలో ఉన్న ఆర్టీసీ బస్సుల పరిస్థితి.
భైంసా పట్టణానికి చెందిన అశోక్ విషయం గమనించి ఆరా తీశాడు. మరికొందరి ప్రయాణికులతో కలిసి డిపో మేనేజర్ని కలిశారు. ఆర్డినరి బస్సులో ఎక్స్ప్రెస్ ఛార్జీలు వసూలు చేయడం సరికాదని తెలిపారు.
పల్లె వెలుగు బస్సులైనప్పటికీ... ప్రయాణికులను సరైన సమయంలో గమ్యానికి చేర్చేందుకే ఎక్స్ప్రెస్ బస్సుగా మార్చి నడుపుతున్నామని డిపో మేనేజర్ తెలిపారు.
వెంటనే పల్లెవెలుగు బస్సుల్లో ఆర్డినరి ఛార్జీలు వసూలు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.