ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కు చెందిన ఆదివాసీ రైతు కోవ అభిమాన్‌కు ఆరెకరాల పొలం ఉంది. ఖరీఫ్ పనులు వేగవంతం కావడంతో తనకున్న ఎద్దులతో పొలాన్ని దున్నుతుండగా.... ఆదివారం అనారోగ్యంతో ఓ ఎద్దు చనిపోయింది. మరో ఎద్దును కొనుగోలు చేయాలంటే.... కనీసం 40వేలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది.
సొమ్ము లేకపోవటంతో పాటు వర్షాల పడే సమయం దాటిపోకుండా పొలాన్ని దున్నాలనుకున్న అభిమాన్.... ఉన్న ఒక్క ఎద్దుతోపాటు మరోవైపు తన కుమారుడు సాయినాథ్‌ను కాడిలా మార్చి పొలం దున్నాడు. ఇదే విషయమై ఈటీవీ భారత్‌లో కన్న కొడుకే కాడెద్దయ్యాడు.. తండ్రి కష్టాన్ని ఒడ్డు దాటించాడు..! అనే కథనం వచ్చింది. ఈ కథనం చూసిన ఎంపీ రంజిత్ రెడ్డి(chevella mp) వారికి ఎద్దు కొనివ్వటానికి ముందుకొచ్చారు. బుధవారం ఇంద్రవెల్లి పశువుల సంతలో ఎద్దు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: కన్న కొడుకే కాడెద్దయ్యాడు.. తండ్రి కష్టాన్ని ఒడ్డు దాటించాడు..!