ETV Bharat / state

Harish Rao Speech at BRS Public Meeting Adilabad : కాంగ్రెస్​ రెండో జాబితా వచ్చాక.. బీఆర్​ఎస్​ సెంచరీ ఖాయమని ఫిక్సయ్యాం : హరీశ్​రావు - ఆదిలాబాద్​లో బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ

Harish Rao Speech at BRS Public Meeting Adilabad : కాంగ్రెస్​ రెండో జాబితా ప్రకటించిన తర్వాత.. ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. ఈ జాబితాతో బీఆర్​ఎస్​ సెంచరీ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో పర్యటించిన మంత్రి.. ఉట్నూరులో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.

BRS Public Meeting
BRS Public Meeting at Adilabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 3:36 PM IST

Updated : Oct 28, 2023, 3:59 PM IST

Harish Rao Speech at BRS Public Meeting Adilabad : కాంగ్రెస్​ రెండో జాబితా వచ్చాక.. బీఆర్​ఎస్​ సెంచరీ కొడుతుందనే నిర్ణయానికి వచ్చామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్​ రెండో జాబితా(Congress MLA Candidates Second List) తర్వాత.. ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్​ సెంచరీ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో పర్యటించిన మంత్రి.. ఉట్నూరులో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

పదేళ్ల నుంచి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఈ పదేళ్లలో కరవు లేదు.. కర్ఫ్యూ లేదన్నారు. ఇందుకే కేసీఆర్​ చేతిలో రాష్ట్రం ఉంటే పదిలంగా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు మన రాష్ట్ర పాలన దిల్లీ నాయకుల చేతుల్లో ఉండాలా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్​కు ఓటు వేయవద్దని.. కర్ణాటక రైతులు వచ్చి ప్రచారం చేస్తున్నారన్నారు. ఈసారి బీజేపీ నేతలకు డిపాజిట్లు రాకుండా చూడాలని ఓటర్లను కోరారు. రైతుబంధు(Ryathu Bandhu Scheme) ఇవ్వొద్దని ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు. ఇప్పటికే ఈ పథకం కింద రైతులకు కేసీఆర్​ రూ.72 వేల కోట్లు ఇచ్చారన్నారు. రైతు బంధు వద్దన్న కాంగ్రెస్​ను రైతులు ఓడించాలని పిలుపునిచ్చారు.

Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్​రావు ఫైర్

BRS Praja Ashirvada Sabha at Adilabad : కాంగ్రెస్​ హయాంలో ఎరువులు లేవు.. ధాన్యం కొనే దిక్కులేదని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. కేసీఆర్​ సాగుకు 24 గంటల కరెంటు అందిస్తే.. కాంగ్రెస్​ నేతలు మాత్రం 3 గంటల కరెంటు చాలని అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​ను నమ్మితే ఆగం అవుతామని.. మోసం, దగాకు మారుపేరు కాంగ్రెస్​ పార్టీ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్​, కాంగ్రెస్​ రనౌట్​ అవుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్​ నేతలు టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అందుకే ఓటుకు నోటు దొంగల చేతుల్లో తెలంగాణ ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

"దిల్లీ అహంకారం గెలవాలా..? తెలంగాణ ఆత్మగౌరవం గెలవాలా..? కాంగ్రెస్​, బీజేపీలకు టికెట్లు కావాలంటే దిల్లీ వెళ్లాలి.. ప్రచారానికి కూడా దిల్లీ నాయకులే రావాలి. కేసీఆర్​ చేతిలోనే తెలంగాణ ఉంటే పదిలంగా ఉంటుంది. ఏ మొహం పెట్టుకొని డీకే శివకుమార్​ తెలంగాణకు వస్తున్నారు. కర్ణాటకలో 3 గంటల కరెంటు ఇస్తున్నారని చెప్పడానికా..? తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కర్ణాటక రైతులు ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ డిపాజిట్​ను జప్తు చేయాలి." - హరీశ్​రావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

Harish Rao Speech at BRS Public Meeting Adilabad కాంగ్రెస్​ రెండో జాబితా వచ్చాక.. బీఆర్​ఎస్​ సెంచరీ ఖాయమని ఫిక్సయ్యాం

Harish Rao Election Campaign at Adilabad : జనవరి 1న ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా జీతం అందుకుంటారని హరీశ్​రావు చెప్పారు. అభివృద్ధికి ఖిల్లాగా ఆదిలాబాద్​ మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని హర్షించారు. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్​ అని.. మళ్లీ బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.16 వేల రైతు బంధు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్యాస్​ సిలిండర్​ను రూ.400లకే అందిస్తామన్నారు. రైతు బీమాతో ప్రజల్లో విశ్వాసం, నమ్మకం వచ్చిందన్నారు. డిసెంబరు 30న కేసీఆర్​ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.

Harish Rao on Assembly Elections : బీఆర్ఎస్ స్కీమ్స్ అన్నీ సూపర్ హిట్.. ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్​దే : హరీశ్​రావు

Harish Rao At Ibrahimpatnam BRS Meeting : 'ప్రతిపక్షాలు ఎన్ని ట్రిక్​లు చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం'

Last Updated : Oct 28, 2023, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.