ETV Bharat / state

BRS MLA Rathod Bapurao to Join Congress : కాంగ్రెస్​లో చేరికల జోష్.. హస్తం​ గూటికి బీఆర్ఎస్​ ఎమ్మెల్యే! - కాంగ్రెస్​లో చేరుతున్న బీఆర్​ఎస్​ నేతలు

BRS MLA Rathod Bapurao to Join Congress : రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ మేరకు కాంగ్రెస్​లోకి చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా బోథ్​ ఎమ్మెల్యే రాఠోడ్​ బాపురావు.. హైదరాబాద్​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్​లో చేరతారన్న ఊహాగానాలు మొదలైయ్యాయి. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కొందరు బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు కాంగ్రెస్​లో చేరుతున్నారు.

Boath MLA Rathod Bapurao
Boath MLA Rathod Bapurao Likely to Join Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 2:52 PM IST

BRS MLA Rathod Bapurao to Join Congress : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్​ పార్టీలోకి చేరికలు(BRS Leaders Join Congress) జోరుగా సాగుతున్నాయి. తాజాగా బోథ్​ నియోజకవర్గం సిట్టింగ్​ ఎమ్మెల్యే రాఠోడ్ ​బాపురావు.. హైదరాబాద్​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన త్వరలో కాంగ్రెస్​లో చేరనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

Boath MLA To Join Congress 2023 : బీఆర్​ఎస్ బోథ్​​ అసెంబ్లీ టికెట్​ను అనిల్​ జాదవ్​కు ఇచ్చినప్పటి నుంచి బాపురావు.. బీఆర్​ఎస్​ పార్టీకి దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఆ పార్టీలో ఉండలేక ఆయన కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్​లో చేరితే.. రెండో జాబితా(T Congress Candidates List 2023)లో బోథ్​ కాంగ్రెస్​ అభ్యర్థిగా టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది.

BRS Leaders Join Congress Party : అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి సమక్షంలో పలు నియోజకవర్గాలకు చెందిన బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు కాంగ్రెస్​ గూటికి చేరుకున్నారు. షాద్​నగర్​, కొడంగల్​, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన నాయకులకు జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో రేవంత్​ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, సాంబయ్య గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్​ నాయక్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు హస్తం గూటికి చేరారు. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన వారిలో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలానికి చెందిన పలువురు నేతలు ఉన్నారు. షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు ప్రతాప్, మంజుల, బాల్ రాజు, గోపాల్, రాములు, యాదయ్య, జహంగీర్, కౌన్సిలర్లు, ఇతర నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Congress Party joinings in Telangana : కాంగ్రెస్​లో ప్రముఖ నాయకుల చేరికకు ముహూర్తం ఖరారు

BRS Leaders Joining in Congress Today : మరోవైపు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ పార్టీకి భారీ షాక్​ తగిలింది. ఆ నియోజకవర్గానికి చెందిన మాదాపూర్​, హాఫీజ్​పేట్​ డివిజన్​ల బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు జగదీశ్వర్​ గౌడ్​, పూజిత జగదీశ్వర్​ గౌడ్​ దంపతులను కాంగ్రెస్​లో చేరారు. జగదీశ్వర్​గౌడ్​ జీహెచ్​ఎంసీ బీఆర్​ఎస్​ ప్లోర్​ లీడర్​గా కొనసాగుతున్నారు. వీరిద్దరిని రేవంత్​ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

కోదాడ, నల్లొండ బీఆర్​ఎస్​ నేతలు కాంగ్రెస్​లో చేరిక : కోదాడకు చెందిన బీఆర్​ఎస్​ నేతలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. కన్మంత్​ రెడ్డి, శశిధర్​రెడ్డి, వెర్నేని వెంకటరత్నబాబు హస్తం కండువా కప్పుకున్నారు. బీఆర్​ఎస్​కు చెందిన నలుగురు జడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు.

నల్గొండ బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన కౌన్సిలర్​లు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. లోటస్​పాండ్​లోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఈ చేరికలు జరిగాయి. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. నల్గొండలో ఉన్న బలానికి ఈ చేరికలు మరింత బలాన్ని ఇచ్చాయని చెప్పారు.

Mahabubnagar BRS Leaders Joining in Congress : పాలమూరు జిల్లాలో బీఆర్​ఎస్​కు షాక్​.. కాంగ్రెస్​లో భారీ చేరికలు

BRS BJP Leaders Joining in Congress : అసంతృప్తులపైనే హస్తం టార్గెట్​.. బీఆర్​ఎస్​ను ఓడించడమే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.