ETV Bharat / state

హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రచార హోరు - బీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహం

BRS Election Campaign in Telangana : ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి పల్లె, పట్నం తేడా లేకుండా ప్రచార జోరు పెంచింది. తొమ్మిదినరేళ్ల ప్రగతిని వివరిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు మరోమారు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. పొరపాటున విపక్షాలకు అవకాశమిస్తే రాష్ట్ర పురోగతి అంధకారమేనని హెచ్చరిస్తున్నారు. హ్యాట్రిక్ సాధించి అధికార పీఠం కైవసం చేసుకునేలా ఇంటింటికి వెళుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

BRS Election Campaign
BRS Election Campaign in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 7:50 PM IST

హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రచార హోరు

BRS Election Campaign in Telangana : సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రంగా మలుచుకున్న బీఆర్‌ఎస్‌(BRS).. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. ఓవైపు అధినేత ప్రజాశీర్వాద సభలతో జనాల్లోకి వెళుతుంటే.. మరోవైపు అభ్యర్థులు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి ప్రచారాలు(BRS Election Campaign) నిర్వహిస్తున్నారు. మళ్లీ మూడోసారి బీఆర్‌ఎస్‌నే అత్యధిక స్థానాల్లో గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీ శ్రేణులు తెలుపుతున్నారు. అందులో భాగంగా అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు. నల్లగుట్ట చుట్టాల బస్తీ ప్రాంతంలోని పలువురు బీజేపీ యువకులు మంత్రి తలసాని ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 70 నుంచి 80 సీట్లతో మరోసారి సర్కారు ఏర్పాటు చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మూడు సీట్లు రాని బీజేపీ.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ ఎన్నికలు, ఆ పార్టీల మధ్యే ప్రధాన పోరు

"అన్ని లెక్కలు చూసుకున్న తర్వాతనే కేసీఆర్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. గతంలో మేనిఫెస్టో విడుదల చేసి అవి అమలు చేసిన తర్వాత.. కల్యాణ లక్ష్మీ అనే కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు. మాకు వెసులుబాటు వచ్చింది కావున చేయగలిగాం. ముఖ్యమంత్రి అన్ని ఆలోచనలు చేసిన తర్వాత మేనిఫెస్టో విడుదల చేశారు. అంతేగాని కాంగ్రెస్‌, బీజేపీ ఏదో మేనిఫెస్టో విడుదల చేస్తే అలవోకగా విడుదల చేసింది అయితే ఇది కాదు. తప్పకుండా తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉన్నాము.. అందుకే తమకు సమస్యలు తెలుసు." - తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి

Telangana Election Polls 2023 : నిర్మల్‌ నియోజకవర్గంలోని నర్సాపూర్‌, దిలావర్‌పూర్ మండలాల్లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి రోడ్‌ షో ద్వారా ఓట్లు అభ్యర్థించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యకు నిరసన సెగ తగిలింది. ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులపై సుభాశ్‌నగర్‌ వాసులు నిలదీయగా ఎన్నికల కోడ్‌ వల్ల ఇవ్వలేకపోతున్నట్లు వివరించారు. మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో పద్మా దేవేందర్‌ రెడ్డి పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి పరిధిలో మంత్రి గంగుల కమలాకర్‌కు మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలికారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచార జోరు : రామడుగు మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సతీమణి గడప గడపకు తిరిగి బీఆర్‌ఎస్‌ పథకాలను వివరించారు. వరంగల్‌ జిల్లా గీసుగొండలోని నందనాయక్‌ తండా, దస్రుతండాల్లో పర్యటించిన చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో బొల్లం మల్లయ్య, యాదగిరి గుట్ట మండలంలో గొంగిడి సునీత ప్రచారాలు నిర్వహించారు.

BRS Party Campaign Strategy 2023 : హ్యాట్రిక్ కొట్టడమే ధ్యేయంగా.. కేసీఆర్ ప్రచార వ్యూహ రచనలు షురూ!

పక్కా వ్యూహాలతో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెళ్తున్న బీఆర్​ఎస్​ ఈ ప్లాన్​ చూస్తే హ్యాట్రిక్​ కొట్టేలాగే కనిపిస్తుందిగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.