ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామంలో పేలుడు ఘటన కలకలం రేపింది. చెక్‌డ్యామ్ నిర్మాణంలో భాగంగా బండరాళ్లను బ్లాస్టింగ్ చేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్ల కారణంగా బండరాళ్లు గ్రామాల్లోకి ఎగిసిపడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన యువకుడు సాయిచరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులు, కుటుంబీకులు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడం వల్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: విద్యుదాఘాతంతో రైతు మృతి