బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. మౌలానా ఇమామ్ ఆలముఖాన్ ఇస్లాం బోధనలను ముస్లిం సోదరులకు వివరించారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు, మత పెద్దలతో పాటుగా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై పుల్లయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండిః కుంటాలను సందర్శించిన భారతి హోళీకేరీ