ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాక్సినేషన్ ఆవశ్యకతపై జిల్లా వైద్యాధికారి డా.నరేందర్ రాఠోడ్ వివరించారు.
తాము చేస్తున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ జిల్లా ఇన్‌ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ ప్రజలకు తెలియజేశారు. కొవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. తమ సేవలు సద్వినియోగం చేసుకోవాలని పట్టణవాసులను కోరారు.
ఇదీ చదవండి: ప్రైవేటు ఆస్పత్రులకు టీకా డోసుల పంపిణీ నిలిపివేత