మూడు రోజులపాటు చేస్తామని చెప్పిన ఆందోళన కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు ఆశా కార్యకర్తల సంఘం గౌరవ అధ్యక్షులు లింగాల చిన్నన్న ప్రకటించారు. ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవన్లో ఆశా కార్యకర్తలు సమావేశమయ్యారు.
ఆరోగ్యశాఖ కమిషనర్ హామీ మేరకు ఆందోళనలు విరమించినప్పటికీ ఆయా హామీలను నెరవేర్చకపోతే మళ్లీ పెద్దఎత్తున నిరసనలకు సన్నద్ధం అవుతామన్నారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి ఆశా కార్యకర్తలు తరలివచ్చారు.
ఇదీ చూడండి: 'వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు'