రైతుల నుంచి ప్రభుత్వం శనగ పంటను కొనుగోలు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పంజాబ్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న మార్క్‌ఫెడ్ మేనేజరు పుల్లయ్య.. అక్కడికి చేరుకుని త్వరలోనే శనగలు కొనుగోలు చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. వ్యాపారులకు రైతన్నలు తమ పంటను అమ్ముకుని నష్టపోకముందే కొనుగోళ్లు చేపట్టాలని కాంగ్రెస్ నాయకురాలు సుజాత పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గవర్నర్ ప్రసంగం చూసైనా విమర్శకులు పంథా మార్చుకోవాలి: బాలరాజు