ETV Bharat / state

పార్టీ నేతల మధ్య అభిప్రాయ బేధాలే తప్పా ఆక్రోశాలు లేవు: మాణిక్‌రావ్‌ ఠాక్రే - బీఆర్ఎస్ పై మాణిక్​రావు ఠాక్రే ఫైర్

AICC Incharge Manikrao Thakre Interview: తెలంగాణలో రెండు నెలల్లో కాంగ్రెస్‌ కదనోత్సాహంతో ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మణిక్‌రావ్‌ ఠాక్రే తెలిపారు. పార్టీ నేతల మధ్య అభిప్రాయ బేధాలే తప్ప... వ్యక్తిగత ఆక్రోశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అంటే గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారమే ఎక్కువ ఉందంటున్న మాణిక్‌రావ్‌ ఠాక్రేతో మా ప్రతినిధి మణికేశ్వర్‌ ప్రత్యేక ముఖాముఖి

author img

By

Published : Jan 24, 2023, 4:40 PM IST

పార్టీ నేతల మధ్య అభిప్రాయ బేధాలే తప్పా ఆక్రోశాలు లేవు: మాణిక్‌రావ్‌ ఠాక్రే
  • ఈటీవీ భారత్ ప్రతినిధి: రాబోయే ఎన్నికల కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ను ఎలా సిద్ధం చేస్తున్నారు.

మాణిక్‌రావ్‌ ఠాక్రే: రెండు మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ముఖ్యనేతలందరితో భేటీ అ‌య్యాను. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగటం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పేదలు, వెనకబడిన వర్గాలకు ఎలా భరోసా కల్పిస్తామనే అంశాన్ని ప్రజల ముందు పెట్టబోతున్నాం. అందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

  • ఈటీవీ భారత్ ప్రతినిధి: భవిష్యత్‌లో బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీపై ఆ రెండు పార్టీలు ఐక్యపోరాటాలకు దిగుతున్నాయి. ఈ పరిణామాలను మీరు ఎలా చూస్తున్నారు. ప్రజలు ఎలా స్పందించే అవకాశం ఉంది?

మాణిక్‌రావ్‌ ఠాక్రే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటమే మా లక్ష్యం. ఈ దిశగా మేం చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి మద్దతు మాకే ఉంది. ఇతరుల అవసరం మాకు లేదు. ఇటీవల రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తే, నేతలతో భేటీ వేళ తెలిసిందేంటంటే ఇతర పార్టీల అవసరం లేకుండానే మేము గెలుస్తామనే నమ్మకం కలిగింది.

  • ఈటీవీ భారత్ ప్రతినిధి: 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు?

మాణిక్‌రావ్‌ ఠాక్రే: ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బీజేపీకి అన్ని విధాలుగా మద్దతిస్తూ వస్తోంది. బీఆర్ఎస్, ఎంఐఎంలాంటి పార్టీలు బీజేపీకి మేలు చేసేందుకే పనిచేస్తుంటాయి. కాంగ్రెస్‌ ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ బీజేపీ ఇలాంటి పార్టీలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాంగ్రెస్‌ ఓట్లను చీల్చి బీజేపీ అధికారంలోకి రావాలనేదే వారి లక్ష్యం.

  • ఈటీవీ భారత్ ప్రతినిధి: ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో గట్టి పట్టుంది. కానీ... దానిని ఉపయోగించుకునే నాయకత్వమే సరిగ్గా లేదనే వాదన ఉంది. దీనిపై మీరేమంటారు?

మాణిక్‌రావ్‌ ఠాక్రే: రెండ్నెళ్లలోగా తెలంగాణలో ఏం జరగబోతుందో మీరే చూస్తారు. పార్టీలో కదనోత్సాహం రానుంది.

  • ఈటీవీ భారత్ ప్రతినిధి: గతంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడిగా పనిచేసిన ప్రతి నేత కొందరికే అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఎవరి వైపైనా ఉన్నారా..? ఒక వేళ కొందరికి అనుకూలంగా ఉన్నారని మీపై ఆరోపణలు వస్తే మీరెలా స్పందిస్తారు?

మాణిక్‌రావ్‌ ఠాక్రే: రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం. తెలంగాణలో ఈ రకంగా జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారం.

  • ఈటీవీ భారత్ ప్రతినిధి: పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారా..?

మాణిక్‌రావ్ ఠాక్రే: కాంగ్రెస్‌లో ఉన్న చాలా మంది నేతలు ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తూ... చాలా ఎన్నికల్లో గెలుపొంది, మంత్రులుగా పనిచేసిన వారున్నారు. ఐక్యతతోనే కాంగ్రెస్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చిన వారు విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించరు. చిన్నచిన్న విభేదాలు ఉంటే చర్చించాం.. తప్పితే ఎవరి మధ్య అంతరాలు లేవు. ఒకట్రెండు నెలల్లో పార్టీలో పరిస్థితులన్నింటిని చక్కదిద్దుకుని... నేతలందరూ ఒకతాటిపైకి వచ్చి పార్టీని ముందుకు తీసుకువెళ్లటం జరుగుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.