ETV Bharat / state

Adilabad SP Uday Kumar : 'అనుమతిలేని ఆయుధాల వినియోగంపై అప్రమత్తంగా ఉంటాం'

author img

By

Published : Jan 24, 2022, 5:25 PM IST

Updated : Jan 24, 2022, 7:19 PM IST

Adilabad SP Uday Kumar : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంఐఎం జిల్లా మాజీ అధ్యక్షుడు ఫారూఖ్‌ అహ్మద్‌కు జీవిత ఖైదు పట్ల ఆదిలాబాద్‌ ఎస్పీ ఉదయ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఫారూఖ్‌కు మరణశిక్ష పడుతుందని భావించామన్నారు. అనుమతి లేకుండా ఆయుధాల వినియోగించేవారిపై ఇకమీదట మరింత అప్రమత్తంగా ఉంటామని చెప్పారు.

Adilabad SP Uday Kumar, Farooq Ahmed case
కాల్పుల కేసులో ఫారుఖ్‌ అహ్మద్‌కు జీవిత ఖైదు పట్ల హర్షం

Adilabad SP Uday Kumar : అనుమతి లేకుండా ఆయుధాల వినియోగించేవారిపై ఇకమీదట మరింత అప్రమత్తంగా ఉంటామని ఆదిలాబాద్‌ ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంఐఎం జిల్లా మాజీ అధ్యక్షుడు ఫారూఖ్‌ అహ్మద్‌కు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించడంపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పు వెలువడగానే ఆయన కోర్టుకు హాజరై... వివరాలు తెలుసుకున్నారు. ఫారూఖ్‌కు మరణశిక్షపడుతుందని భావించామంటున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డితో ఈటీవీ భారత్ స్పెషల్ ఇంటర్వ్యూ...

కాల్పుల కేసులో ఫారుఖ్‌ అహ్మద్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఫారూఖ్‌కు మరణశిక్ష పడుతుందని భావించాం. మరణశిక్ష పడేలాగా ప్రయత్నించాం. మిగిలిన నిందితులకు శిక్ష వేయకపోవటాన్ని పరిశీలిస్తాం. ప్రతివాదులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

-ఉదయ్​కుమార్, ఆదిలాబాద్ ఎస్పీ

కాల్పుల కేసులో ఫారుఖ్‌ అహ్మద్‌కు జీవిత ఖైదు పట్ల ఎస్పీ హర్షం

ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం మాజీ అధ్యక్షుడు ఫారుఖ్‌కు జీవితఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 2019 డిసెంబర్ 18న జమీర్‌పై కాల్పుల ఘటనలో ఫారూఖ్ అహ్మద్‌కు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరిచింది. పిల్లల క్రికెట్‌ వివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీయడంతో ఫారూఖ్‌ కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ అదే ఏడాది డిసెంబర్ 26న మృతి చెందాడు. తన కుమారుడిని తిట్టాడని జమీర్‌ అనే వ్యక్తిపై ఫారూఖ్ కాల్పులు జరిపాడు. ఈ కేసులో ఏ-2, ఏ-3లుగా ఉన్న ఫిరోజ్​ ఖాన్, మహ్మద్ అర్షాద్​లను కోర్టు నిర్దోషులుగా తేల్చిచెప్పింది. ఫారూఖ్‌కు జీవితఖైదు తోపాటు.. 12 వేల రూపాయల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Life imprisonment for former AIMIM leader: ఎంఐఎం మాజీ నేత ఫారూఖ్ అహ్మద్​కు జీవితఖైదు

Last Updated : Jan 24, 2022, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.