ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌లోని పలు ప్రధాన మార్గాల్లో అద్దె బస్సులు తిరుగుతున్నా.. మారుమూల ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్‌స్టేషన్ పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని డీఎం తెలిపారు.
ఇవీచూడండి: ఆర్టీసీని కాపాడుకోవడమే సమ్మె ఉద్దేశంః అశ్వత్థామరెడ్డి