ఒకప్పుడు ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ పురాతనంగా....కళావిహీనంగా కనిపించేంది. అత్యవసరమైతే తప్ప అక్కడకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇష్టపడేవారు. కానీ ప్రస్తుతం అక్కడకి వెళ్లడమే కాదు.. స్వీయ చిత్రాలు తీసుకునేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టాలన్న ఉన్నతాధికారుల సూచన మేరకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా...
రైల్వే స్టేషన్ ప్రారంభంలో గోండు సంస్కృతికి అద్దంపట్టేలా గీసిన చిత్రాలు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. స్థానిక సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచే ఆ ప్రాంతంలో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. స్టేషన్ గోడలన్నింటినీ గిరిజనుల ఆచారాలు, పల్లె సంప్రదాయాలు వెల్లివిరిసేలా సుందరంగా రూపొందించారు.
స్వచ్ఛత కోసం మొక్కలు
రైల్వేస్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు పరిసరాలన్నీ ఆహ్లాదంగా ఉండేలా మొక్కలు నాటారు. రైల్వే స్టేషన్‌ను అందంగా తీర్చిదిద్దడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఫాస్టాగ్‌తో టోల్ చెల్లింపులే కాదు.. నేరగాళ్లనూ పట్టుకోవచ్చు!