ఆదిలాబాద్ మున్సిపలిటీ పరిధిలో కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. సూపర్ స్ప్రెడర్ల కింద వీధి వ్యాపారులు, దుకాణదారులు, కూరగాయల విక్రయదారులను గుర్తించి టీకాలు ఇప్పిస్తున్నారు. ఇందుకోసం పట్టణంలో రెండు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. 10 వేల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు... ఇప్పటి వరకు 3 వేల మందికి టీకాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన వారంతా కచ్చితంగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రేమేందర్ సూచించారు.
ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్సీ!!