రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేసేందుకు వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదిలాబాద్ జిల్లా జేసీ సంధ్యారాణి పేర్కొన్నారు.
గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బీర్సాయి పేటలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేంద్రాన్ని జేసీ సంధ్యారాణి, ఉట్నూర్ ఎంపీపీ జయవంత్రావు ప్రారంభించారు.
ముందుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు వరికోత కోసేందుకు యంత్రాలను పంపిణీ చేయాలని కోరారు. రైతులు పండించిన పంటను ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరపాలని సూచించారు.