ETV Bharat / state

నిత్యావసర సరకులు, లగేజీ బ్యాగులతో 'పది' పరీక్షలకు.. కారణమిదే - పదో తరగతి విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం

10th Class students problems: సాధారణంగా పరీక్షలు అనగానే విద్యార్థులు పెన్నులు, ప్యాడ్లు వంటివి తీసుకెళ్తారు. కానీ ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజీ విద్యార్థులు మాత్రం ఒకరోజు ముందే పరీక్ష రాసేందుకు ప్రత్యేక వాహనంలో నిత్యావసర సరకులు, బ్యాగులతో తల్లిదండ్రులను వెంటేసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేగా మీ సందేహం. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.

10th Class students problems
10th Class students problems
author img

By

Published : Apr 3, 2023, 7:15 AM IST

పరీక్షలు రాసేందుకు కరంజీ పదోతరగతి విద్యార్థుల పాట్లు

10th Class students problems: ఇక్కడ కనిపించే వారంతా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజీ ఉన్నత పాఠశాల విద్యార్థులు. అదే మండలం అందర్ బంద్ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఒక రోజు ముందే ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. బస్సులు అందుబాటులో లేక రహదారి గుంతలమయం కావడంతో ముందస్తుగా అందర్‌ బంద్‌ చేరుకున్నారు. కరంజీ నుంచి 30 కిలోమీటర్లు దూరం రావడానికి వారికి గంటన్నర సమయం పట్టింది. అంటే రోడ్డు దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

"మా ఊరు రోడ్డు అస్సలు బాగోదు. వెళ్లి రావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. మరల రేపటి పరీక్షకు చదవడానికి ఇబ్బంది. అంతే కాదు మేము వచ్చే బండి ఎప్పుడు పంక్చర్​ అవుతుందో తెలియని పరిస్థితి. అందుకే ఇంటి దగ్గర వస్తువులు తీసుకొని ఇక్కడికి వచ్చాం. పరీక్షలు ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండి భోజనం చేసి ఇక్కడే చదువుకుంటాం. ఈ ఊరు సర్పంచ్​ మాకు ఎంతో సహాయం చేశారు. ఆయనకు కృతజ్ఞతలు"- పదో తరగతి విద్యార్థిని

పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారం రోజుల ముందే తల్లిదండ్రులు అందర్‌ బంద్ గ్రామ సర్పంచిని కలిసి వసతి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మానవత్వంతో స్పందించిన సర్పంచ్‌.. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు వేర్వేరుగా ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ సహకారానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"మా ఊరు నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. మా పిల్లల కోసం నిత్యావసర సరుకులతో ఇక్కడికి వచ్చాం. ఇబ్బందిగా ఉన్నా.. మా పిల్లల చదువుల కోసం తప్పదు కదా".- విద్యార్థులు తల్లిదండ్రులు

ఐదేళ్ల క్రితం అందర్‌ బంద్‌ పాఠశాలకు పదో తరగతి పరీక్షా కేంద్రం వచ్చిందని ఇక్కడకి వచ్చే విద్యార్థులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నామని సర్పంచ్‌ కృష్ణ యాదవ్‌ తెలిపారు. కరంజీకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని వసతి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామంటున్న అధికారులు.. కరంజీ విద్యార్థుల కష్టాలకు ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

"ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి మేము మీ ఊర్లో ఉండడానికి అవకాశం ఇవ్వండి అని అడిగారు. విద్యార్థుల భవిష్యత్​ దృష్ట్యా మా గ్రామస్థుల సహకారంతో వారికి అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థి, విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు వేరువేరుగా వసతి గృహాలు ఏర్పాటు చేశాం.-కృష్ణ యాదవ్, అందర్‌ బంద్‌ సర్పంచ్

ఇవీ చదవండి:

కర్ణాటకలో కాంగ్రెస్​ గెలిస్తే.. తెలంగాణలో విజయం మాదే: రేవంత్​రెడ్డి

'ఆస్కార్' వీరుడుకి స్వగ్రామంలో సత్కారం..

ఉచిత సిలిండర్​ ఇస్తానని నమ్మించాడు.. వృద్ధురాలి బంగారం దోచేశాడు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.