విభిన్న సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం భారతదేశమని ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జెన్నిఫర్ బృందం రూపొందించిన ‘గుస్సాడి-సెలెబ్రేషన్ ఆఫ్ బీయింగ్ గాడ్’ పుస్తకావిష్కణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జిల్లాలోని.. గోండు, కోలామ్, థోటిస్, పర్దన్ తెగ వారు జరుపుకునే గుస్సాడి పండుగకు సంబంధించి.. డాక్యుమెంటరీతో పాటు పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. 2014 నుంచి గుస్సాడి సంప్రదాయంపై జెన్నిఫర్ బృందం ఎన్నో పరిశోధనలు చేసినట్లు గుర్తు చేశారు. ఇలాంటి సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయని దేశంలో చాలా మందికి తెలియదంటూ.. నేడు వారు రూపొందించిన డాక్యుమెంటరీతో ప్రపంచ దేశాలకు పరిచయమయ్యే అవకాశాలున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సర్వేశ్వర్ రెడ్డి, కల్యాణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'రైతు బంధు సమితికి వెబ్ సైట్‌ను ఏర్పాటు చేయండి’