ETV Bharat / state

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఒకరిని కాదు ఇద్దరినీ..

ఒకరిని పెళ్లి చేసుకుని వారితోనే వేగలేక పోతున్నామని కొందరు అంటుంటే ఓ వ్యక్తి ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. అదీ కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం.. పెద్దలు దగ్గరుండి జరిపిన పెళ్లి. ఈ పెళ్లి మూడు రోజుల కింద జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

marriage, adilabad
పెళ్లి, ఆదిలాబాద్​
author img

By

Published : Jun 17, 2021, 10:46 PM IST

ఒకే కల్యాణ మండపం.. ఒకే వరుడు.. ఇద్దురు వధువులు

ప్రేమించిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ప్రేమించిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలంటే ఒక్కొక్కరు కనీసం రెండు, మూడు వివాహాలు చేసుకోవాలి. కాని ఓ వ్యక్తి తను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను ఒకే కల్యాణ మండలంలో ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత ఘటన ఆదిలాబాద్​ జిల్లాలో జరిగింది.

ఉట్నూర్ మండలం ఘనపూర్​కు చెందిన అర్జున్, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ సమయంలోనే తన మేనత్తల కూతుళ్లను ప్రేమించాడు. ఉషారాణిది అదే ఊరు కాగా.. సూర్యకళది శంభుగూడెం. మూడేళ్లుగా ఇద్దరు మరదళ్లను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించాడు అర్జున్​.

నెల రోజుల కిందట ఇద్దరినీ ప్రేమించాను, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని మూడు కుటుంబాల సభ్యులకు తెలిపాడు. వారు గ్రామ పెద్దలు ఆశ్రయించారు. సూర్యకళ, ఉషారాణిని అర్జున్​కు ఇచ్చి వివాహం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈనెల 14న ఘన్​పూర్​లో సూర్యకళ, ఉషారాణిని ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అర్జన్​ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: KTR: ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో ఏం లాభం జరిగింది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.