నెలల తరబడి అన్నదానం చేయడమంటే.. అనుకున్నంత సులవైన పనేం కాదు. ప్రతి రోజు అదే దినచర్యగా కొనసాగించడమనేది సాహసోపేతమైన నిర్ణయమే. ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని జయశ్రీ.. గతేడాది లాక్డౌన్లో 62 రోజుల పాటు అన్నదానం నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ రెండో దశలో.. భర్త వేణుగోపాల్‌రెడ్డితో కలిసి ఈనెల 12 నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు తానే వంట చేసి.. ఆకలితో అలమటిస్తోన్న కనీసం 75 మందికి భోజనం అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
కష్ట కాలంలో పేదల ఆకలి తీర్చడం.. తమకెంతో సంతృప్తినిస్తోందంటున్నారీ దంపతులు. ఆపత్కాలంలో మానవతావాదులంతా ముందుకొచ్చి.. పేదలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇతరుల నుంచి నయా పైసా తీసుకోకుండా ఉదారతను చాటుకుంటోన్న ఈ భార్యాభర్తల గురించి తెలిసిన వారంతా.. వీరిని కొనియాడుతున్నారు.
ఇదీ చదవండి: Anandaiah: 'ఆనందయ్య మందుకు అనుమతివ్వాలి.. కార్పొరేట్‌కు లొంగొద్దు'