ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మర్కజ్ యాత్రకు వెళ్లివచ్చి కరోనా బారినపడిన 21 మంది బాధితులు గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జీ అయ్యాక.. వ్యాధి తీవ్రత తగ్గిందనే భావన అందరిలో కనిపించింది.
లక్షణాలున్న వారికే కరోనా నిర్ధరణ పరీక్షలు
కానీ ఇటీవల మహారాష్ట్రకు వెళ్లి తిరిగి వచ్చిన ఉట్నూర్‌కు చెందిన తొమ్మిది మంది వలస కూలీలకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. వీరందరికి ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. లక్షణాలున్న వ్యక్తులకే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని డీఎంహెచ్ఓ డా.నరేందర్ రాఠోడ్ తెలిపారు.
ఇదీ చూడండి: విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలా : హైకోర్టు