ETV Bharat / state

కొవిడ్ ఎఫెక్ట్: నెలలో 40 మంది టీచర్ల మృతి - ఉమ్మడి ఆదిలాబాద్​ వార్తలు

కరోనా విజృంభిస్తుండటంతో మినీ ఉప పోరు విధులపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కరోనాతో 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మరణించడంతో... ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి అంటూ వేడుకుంటున్నారు.

40-teachers-died-with-covid-in-state-and-the-span-of-one-month
కొవిడ్ ఎఫెక్ట్: నెలలో 40 మంది టీచర్ల మృతి
author img

By

Published : Apr 28, 2021, 6:57 AM IST

కరోనా మహమ్మారితో గత నెల రోజుల్లో సుమారు 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మరణించారు. వారిలో సుమారు 25 మంది గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో పనిచేస్తున్నవారు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12 మంది బలయ్యారు. హైదరాబాద్‌ జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఒకరు, ఈ నెల 26న నలుగురు చనిపోయారు. వీరందరూ మహిళలే కావడం గమనార్హం.

మార్చికి 20.. ఏప్రిల్​లో 40

రంగారెడ్డి జిల్లాలో సోమవారం పీఈటీ, తెలుగు పండిత్‌ మృతి చెందారు. జగిత్యాల జిల్లాలో ఇద్దరు, కుమురంభీం ఆసిఫాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు, మంచిర్యాల జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు అసువులు బాశారు. మార్చి నాటికి 20 మంది ఉపాధ్యాయుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. ఏప్రిల్‌లో 40 మంది మృతి చెందారని పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే ఏడాది కాలంలో 20 మంది ఉపాధ్యాయులను కరోనా బలి తీసుకుందని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్‌ తెలిపారు.

అమ్మో.. ఎన్నికల విధులు!

కరోనా విజృంభిస్తుండటంతో మినీ ఉప పోరు విధులపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దివ్యాంగులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులున్న ఉపాధ్యాయులను ఆ విధుల నుంచి మినహాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి: కరోనాతో ఏడాదిన్నర వయసు చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.