కరోనా కారణంగా మరో క్రికెటర్ తండ్రి మృతి చెందాడు. టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా తండ్రి ప్రమోద్ చావ్లా కొవిడ్‌తో పోరాడుతూ తుది శ్వాస విడిచాడు. గత పది రోజులుగా మహమ్మారితో పోరాడుతున్న ప్రమోద్ చావ్లా.. మెరుగైన వైద్యం కోసం దిల్లీకి తరలించారు. అయినప్పటికీ.. లాభం లేకపోయింది. తన తండ్రి మరణ వార్తను పీయూష్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు చావ్లా. ఐపీఎల్లో పీయూష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబయి ఇండియన్స్ జట్టు.. అతడి తండ్రి మృతి పట్ల సంతాపం ప్రకటించింది. ఈ కష్ట సమయంలో చావ్లా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.
చావ్లా తండ్రి మృతిపై సంతాపం ప్రకటించాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. "కరోనా మహమ్మారి మరోకరి ప్రాణాలను బలితీసుకుంది. నా సోదరుడు చావ్లా తండ్రి ప్రమోద్ అంకుల్ ఇక లేరు. చావ్లా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పఠాన్ ట్వీట్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ పేసర్, యువ క్రికెటర్ చేతన్ సకారియా తండ్రి కంజి బాయి కూడా కరోనాతోనే మృతి చెందారు. ఈ ఏడాది ఆరంభంలో తన సోదరుడిని కోల్పోయాడు సకారియా.
ఇదీ చదవండి: కొవిడ్‌తో యువ క్రికెటర్ తండ్రి మృతి