టోక్యో ఒలింపిక్స్ సెమీస్లో పురుషుల హాకీ జట్టు ఓటమిపై నిరాశచెందాల్సిన పనిలేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గెలుపోటములు.. జీవితంలో భాగమన్నారు. భారత జట్టు ఉత్తమ ఆటతీరు కనబరిచిందని.. అదే లెక్కలోకి వస్తుందని మోదీ స్పష్టం చేశారు.
ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాను ఉత్సాహపరిచారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. "బాయ్స్.. మీరు బాగా ఆడారు. అత్యుత్తమ ప్రదర్శన చేశారు. మేము మీ వెన్నంటే ఉన్నాం. మనకు ఇంకో అవకాశం(మ్యాచ్) ఉంది" అని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: Tokyo Olympics Live: సెమీస్లో టీమ్ఇండియా ఓటమి.. సోనమ్కూ నిరాశే