ETV Bharat / sports

ఒలింపిక్స్​లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతున్నాయి​. అన్నిరకాల క్రీడలు నిర్వహిస్తున్నారు. కానీ క్రికెట్​ ఆడినట్లు మాత్రం ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. అసలు విశ్వక్రీడల్లో ఈ గేమ్​ పెట్టకపోవడానికి కారణమేంటో తెలుసా?

Why Cricket not played in Olympics?
క్రికెట్
author img

By

Published : Aug 6, 2021, 11:47 AM IST

టోక్యో ఒలింపిక్స్​ సూపర్​గా జరుగుతున్నాయి. అన్ని దేశాల క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తూ, పతకాలు కొల్లగొడుతున్నారు. ఇందులో అన్ని క్రీడలు ఉన్నాయి కానీ క్రికెట్​కు మాత్రం ఇప్పటికీ స్థానం లేదు. అరే అవును కదా! అనుకుంటున్నారు. క్రికెట్​, ఒలింపిక్స్​లో ఎందుకు లేదో ఎప్పుడైనా ఆలోచించారా?

ఒకే ఒక్క మ్యాచ్​

ఒలింపిక్స్​లో ఏకైక క్రికెట్​ మ్యాచ్​ను​ 1900 పారిస్ వేదికగా నిర్వహించారు. గ్రేట్ బ్రిటన్​-ఫ్రాన్స్ తలపడ్డాయి. ఆగస్టు 19-20 తేదీల్లో ఈ మ్యాచ్ జరిగింది. గ్రేట్​ బ్రిటన్​ రజతం అందుకోగా, ఫ్రాన్స్​ కాంస్య పతకం దక్కించుకుంది.

cricket olympics
ఒలింపిక్స్ క్రికెట్

ఆపేయడానికి ఇవే కారణాలు

1900​ తర్వాత ఒలింపిక్స్​లో క్రికెట్​ను పూర్తిగా​ ఆపేశారు. దానికి రెండు కారణాలు. ఒలింపిక్స్​లో పాల్గొనే యూఎస్, రష్యా, చైనా, జర్మనీ, జపాన్​ లాంటి దేశాలు.. ఈ ఆటపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం.

అలానే ఓ క్రికెట్ మ్యాచ్​ కోసం దాదాపు 4-5 గంటల కంటే ఎక్కువ సమయం ​వెచ్చించాల్సి రావడం ఈ ఆటను విస్మరించడానికి కారణంగా కనిపిస్తోంది.

బీసీసీఐ మాత్రమే ఆసక్తి

భారత క్రికెట్​ బోర్డు మినహా ఇతర దేశాలు ఒలింపిక్స్​లో క్రికెట్​ను జోడించాలనే విషయమై అంత ఆసక్తి చూపలేదు.

ఒలింపిక్స్​ ఆతిథ్య దేశాల్లో చాలావరకు క్రికెట్ స్టేడియాలు ఉండవు. ప్రత్యేకించి దీని కోసమే స్టేడియాలు నిర్మించి, వాటిని నిర్వహించడం వల్ల ఆతిథ్య దేశాలకు ఆర్థిక భారం పెరగొచ్చు. ఈ కారణాల వల్లే ఒలింపిక్స్​లో క్రికెట్​ను పెట్టాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకున్నారు!

cricket olympics
క్రికెట్ మ్యాచ్​లోని దృశ్యం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.