ETV Bharat / sports

ప్రపంచ నంబర్‌వన్‌ వినేశ్‌ ఫొగాట్‌కు ఏమైంది..!

author img

By

Published : Aug 15, 2021, 1:30 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో కచ్చితంగా పతకం సాధిస్తుందని అనుకున్న రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ నిరాశతోనే వెనుదిరిగింది. అయితే ఆమె అక్కడి నుంచి వచ్చేసరికి పూర్తిగా కుంగిపోయింది. మళ్లీ మ్యాచ్​పైకి రాలేనేమో అంటూ ప్రకటించి ఆందర్నీ షాక్​కు గురిచేసింది. ఇంతకీ ఆమెకు ఏమైంది?

vinesh
వినేశ్​

మనస్సు అత్యంత శక్తిమంతమైంది.. ఓటమి అంచున ఉన్నా గెలిపించగలదు.. విజయం ముంగిట ఉన్నా ఓడించగలదు.. 'అథ్లెట్లకు ప్రతి రోజు చాలా కీలకమైనదే.. బరిలోకి దిగే సమయానికి ఎలా ఉన్నాము.. శరీరం, మనస్సు ఎంత సహకరిస్తున్నాయన్నదానిపైనే ఆ రోజు విజయం ఆధారపడి ఉంటుంది'.. ఈ మాటలు అన్నది ఎవరోకాదు.. ఒలింపిక్స్‌ ట్రాక్ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన నీరజ్‌ చోప్రా. ప్రపంచ ర్యాంకింగ్‌లో నాలుగో స్థానంలో ఉన్న చోప్రా.. నంబర్‌ వన్‌ ర్యాంకర్‌తో సహా ప్రతిఒక్కరినీ వెనక్కి నెట్టి స్వర్ణం సాధించారు. ఈ పతకాల సంబరాల్లో భారత్‌ ఓ ఛాంపియన్‌ను మరిచిపోయింది. ఆమె రెజ్లింగ్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి వినేశ్‌ ఫొగాట్‌..! పతకం ఖాయంగా తెస్తుందనుకొన్న వినేశ్‌ ఒలింపిక్స్‌ నుంచి వచ్చేసరికి పూర్తిగా కుంగిపోయింది. ఒక్కసారిగా వివాదాలు చుట్టుముట్టాయి.. ఒక్క పతకం కోల్పోవడం తన జీవితాన్ని పాతాళంలోకి నెట్టేసిందన్న క్షోభను అనుభవిస్తోంది. మళ్లీ మ్యాట్‌పైకి రాలేనేమో అంటూ ఆమె ప్రకటించడం సంచలనం సృష్టించింది.

ఒలింపిక్స్‌కు ముందు అసలేం జరిగింది..!

వినేశ్‌ తలకు 2017లో బలమైన గాయమైంది. దీంతో ఆమె కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గందరగోళంలోకి వెళ్లిపోతుంది. ఆ సమయంలో తల దేనికైనా తగిలిస్తే తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ సమస్య ఉన్న వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవడం, వాంతి వస్తున్నట్లు అనిపించడం, చూపు ఒక్కసారిగా తగ్గిపోవడం, వెలుతురు, చప్పుడుకు ఇబ్బంది పడటం వంటివి ఎదుర్కొంటారు. కొంత గందరగోళం, ఏకాగత్ర తగ్గడంతోపాటు.. కుంగుబాటుకు లోనవుతారు. వినేశ్‌ వీటిల్లోని కొన్ని సమస్యలను దాదాపు నాలుగేళ్లుగా అనుభవిస్తోంది. కానీ, వీటిని పెద్దగా పట్టించుకోలేదు. శిక్షణ కొనసాగించింది. 2019లో కూడా కొన్నాళ్లు డిప్రెషన్‌లో ఉంది.

కీలకమైన బౌట్‌కు ముందు రోజు ఆమె ఆహారం తీసుకోలేదు.. కేవలం పోషకాలు ఉన్న డ్రింక్‌ను మాత్రమే తాగింది. కొంత తెలియని కంగారు ఆమెలో నెలకొంది. బౌట్‌ రోజు నిద్రలేస్తూనే కొంత ఇబ్బంది పడింది. ఒక సారి వాంతి చేసుకొంది. కొద్ది సేపటి తర్వాత బస్సులో ఒలింపిక్‌ స్టేడియానికి వెళ్లింది. అక్కడ తన ఫిజియో పూర్ణిమను సంప్రదించింది. తర్వాత వార్మప్‌ చేసింది.. అయినా ఫలితం లేదు. అలానే మ్యాచ్‌ బరిలోకి దిగింది. తొలిబౌట్‌ తర్వాత రెండు ఉప్పు క్యాప్సిల్స్‌ను తీసుకొంది.. కానీ వెంటనే ఫలితం కనిపించలేదు. అలానే రెండో బౌట్‌ను మొదలుపెట్టింది. ఓడిపోతానన్న విషయం ఆమెకు స్పష్టంగా తెలిసిపోయింది.

రెండు సార్లు కొవిడ్‌ బారినపడి..

వినేశ్‌ రెండు సార్లు కొవిడ్‌ బారిన పడింది. 2020లో ఆమెకు తొలిసారి కొవిడ్‌ సోకింది. కొలుకొన్న తర్వాత నుంచి ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడంలో ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఖజకిస్థాన్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌ నుంచి వచ్చాక ఆమె మరోసారి కొవిడ్‌ బారిన పడింది. కొన్నాళ్లకు ఆమె కుటుంబం మొత్తానికీ కొవిడ్‌ సోకింది. దీంతో కొవిడ్ భయంతోనే ఆమె హంగేరీ నుంచి టోక్యో వచ్చాక టీమిండియాకు దూరంగా ఉంది. విమానంలో ప్రయాణించి వచ్చిన తన నుంచి భారత ఒలింపిక్స్‌ బృందానికి కొవిడ్‌ సోకుతుందని భయంతో ఆమె ఈ పనిచేసింది.

శిక్షణపై వివాదం..

వినేశ్‌ మ్యాచ్‌ ఓటమి తర్వాత భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ ఒక్కసారిగా మండిపడ్డారు. హంగేరియన్‌ శిక్షకుడు వాలెర్‌ తమను మోసం చేశాడని ఆరోపించారు. వినేశ్‌కు శిక్షణ పేరుతో అతని భార్య మారియాన సస్టైన్‌కు శిక్షణ ఇచ్చాడని పేర్కొన్నారు. దీంతోపాటు ఓజీక్యూ, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలను కూడా ఆయన తప్పుపట్టారు. వినేశ్‌ అంకుల్‌, రెజ్లర్‌ అయిన మహావీర్‌ కూడా తప్పంతా కోచ్‌దే అని తేల్చారు. వచ్చే నాలుగేళ్లలో తానే స్వయంగా వినేశ్‌కు శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు.

ఆ తర్వాత వినేశ్‌ను టోక్యో క్రీడల్లో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలను పాటించలేదన్నకారణంతో సస్పెండ్‌ చేశారు. తాజాగా వినేశ్‌ తన క్షమాపణలను డబ్ల్యూఎఫ్‌ఐకు పంపించారు. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొనేందుకు ఆమెను అనుమతించే విషయం తేలాల్సి ఉంది.

వాస్తవానికి వాలెర్‌ భార్య మారియాన కూడా ఒలింపిక్స్‌లో పాల్గొని ఓటిమిపాలైంది. ఇటీవల వినేశ్‌ మాట్లాడుతూ కోచ్‌ను సమర్థించారు. కొవిడ్‌ సమయంలో ఆయన కుమారుడిని బుడాపెస్ట్‌లో వదిలేసి లఖ్‌నవూ వచ్చి తనకు శిక్షణ ఇచ్చారని పేర్కొంది. తన ఓటమికి అతన్ని తప్పు పట్టలేమని పేర్కొంది. ఇదే బృందంతో గత మూడేళ్లుగా విజయాలు సాధించిన విషయాన్ని గుర్తు చేసింది.

ఒలింపిక్స్‌ ఒత్తిడి ఎక్కువే..

బృంద క్రీడలతో పోలిస్తే రెజ్లింగ్‌ వంటి వ్యక్తిగత స్థాయిలోని క్రీడల్లోని ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. బృంద క్రీడల్లో గెలుపోటములకు జట్టు సమష్టి బాధ్యత వహిస్తుంది. కానీ, వ్యక్తిగత స్థాయిలో జరిగే క్రీడల్లో ఇది సాధ్యం కాదు. ఓటమి భారాన్ని క్రీడాకారుడు ఒక్కడే మోయాలి. వాస్తవానికి వ్యక్తిగత విజయాలకు గుర్తింపు కూడా ఎక్కువే అని అభినవ్‌ బింద్రా, నీరజ్‌ చోప్రాలను చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్‌ 1 ర్యాంకింగ్‌లో ఉన్న వినేశ్‌పై ఉండే ఒత్తిడిని అర్థం చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: Vinesh Phogat: 'ఇంకా ఓటమి బాధలోనే.. ఇక రెజ్లింగ్ కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.